నార్త్ ఇండియా మార్కెట్‌లో ఎన్టీఆర్ కెరీర్ రికార్డు!

25th, August 2016 - 05:30:06 PM

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా మరో వారం రోజుల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించడంతో తెలుగుతో పాటు తమిళ, మళయాల పరిశ్రమల్లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండి పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అదేవిధంగా నార్త్ ఇండియా మార్కెట్లోనూ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మంచి ధరకు అమ్ముడవడం విశేషంగా చెప్పుకోవాలి.

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న ఒడిశాతో పాటు మిగతా నార్త్ ఇండియా మొత్తానికి సంబంధించి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు సుమారు 65 లక్షలకు అమ్ముడయ్యాయి. ఎన్టీఆర్‌కు అక్కడి మార్కెట్‌లో ఇదే కెరీర్ బెస్ట్ బిజినెస్‌ కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. కొరటాల శివ శైలిలోనే సోషల్ మెసేజ్‌తో కూడుకున్న కమర్షియల్ సినిమాగా ‘జనతా గ్యారెజ్’ ప్రచారం పొందుతోంది.