వైజాగ్‌లో ‘జనతా గ్యారేజ్’ విజయోత్సవ వేడుక!

janatha-garage-2
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారెజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన గత గురువారం విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలుచోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే తమ సినిమాకు ఇంతటి విజయాన్ని సాధించి పెట్టిన ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు జనతా గ్యారేజ్ టీమ్ ఈ నెల 10న ఓ భారీ విజయోత్సవ వేడుకను ప్లాన్ చేసింది.

వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ఎన్టీఆర్ సహా టీమ్ మొత్తం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే నాన్ స్టాప్‌గా వసూళ్ళు సాధిస్తోన్న ఈ సినిమా, ఈ శనివారం జరిగే విజయోత్సవ వేడుకతో వచ్చే వారం కూడా ఇదే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టే సూచనలున్నాయని ఆశించొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.