జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్ కు అడ్డుపడ్డ వినాయకుడు

janatha-garage-2
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ రికార్డ్ కలెక్షన్ల సాగిపోతున్న విషయం తెలిసిందే. మొత్తం ఆరు రోజులకు గాను ఏపీ, తెలంగాణాల్లో ఈ చిత్రం రూ.43.22 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అంతేగాక బాహుబలి రువాత అత్యంత వేగంగా రూ. 60 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. దీంతో చిత్ర టీమ్ ఈ అపూర్వ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వైజాగ్ లో ఈరోజు సక్సెస్ మీ ను ఏర్పాటు చేయాలనుకుంది.

కానీ వైజాగ్ లో వినాయక్ చవితి ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతుండటం, పోలీస్ శాఖ, ట్రాఫిక్ విభాగాలు చాలా వరకూ ఆ ఉత్సవ భద్రతా పర్యవేక్షణలో ఉండటం వలన సభకు సెక్యూరిటీ ఇవ్వడం కష్టమని, అభిమానులు భారీ సంఖ్యలో వస్తే ఇబ్బంది ఏర్పడుతుందని సభను క్యాన్సిల్ చేసి వేరే డేట్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కొత్త తేదీ, సభా ప్రాంగణం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.