జనతా గ్యారేజ్ మొదటి రోజు కలెక్షన్ల వివరాలు

Janatha-Garage
భారీ అంచనాల నడుమ, పెద్ద ఎత్తున రిలీజైన జనతా గ్యారేజ్ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రదర్శింపబడ్డ మొదటి షో నుండే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో సత్తా చూపింది. ట్రేడ్ వర్గాలు, చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గుంటూరులో రూ. 2,58,34,975, కృష్ణాలో రూ. 1,54,12,857, ఉత్తరాంద్రలో రూ. 2,29,24,000, ఈస్ట్ గోదావరిలో రూ. 2,28,04,588, నైజాంలో రూ.5. 51 కోట్ల షేర్ సాధించింది.

మొత్తం మీద ఏపీ, తెలంగాణల్లో కలిపి దాదాపు రూ.21 కోట్ల షేర్ వసూలు చేసి కొన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డులు కూడా సృష్టించింది. అలాగే యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం హవా కొనసాగింది. మొదటి రోజే దాదాపు $560,509 వసూళ్లు సాధించి మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. దగ్గర్లో పెద్ద హీరోల సినిమాలు కూడా లేకపోవడంతో లాంగ్ రన్ లో ఈ చిత్రం యొక్క కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశముంది.