‘జనతాగ్యారేజ్’ షూటింగ్ అప్డేట్స్

janathagarage1
‘యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ’ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. టీజట్, ట్రైలర్స్, పాటలు అన్నీ బాగుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ ను నానకరామ్ గూడా లో వేసిన భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. నృత్య దర్శకుడు ‘శేఖర్ మాస్టర్’ కంపోజ్ చేస్తున్న ఈ పాటను ‘ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్’ పై చిత్రీకరించనున్నారు.

మొత్తం నైట్ ఎఫెక్ట్ లో సాగే ఈ పాటను 5 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ‘ఏ. ఆర్. ప్రకాష్’ ఈ పాటకు భారీ సెట్ ను ఆరెంజ్ చేశారు. ఈ చిత్రంలో ‘నిత్యామీనన్, సమంత’ లు ఎన్టీఆర్ కు జంటగా నటిస్తుండగా ‘దేవి శ్రీ’ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది.