ఆ మూవీ కోసం నేను రోజులు లెక్కిస్తున్నాను – జాన్వీ కపూర్

Published on Mar 19, 2023 1:03 am IST


ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ ని అలానే పలు సక్సెస్ లని అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు యువ భామ జాన్వీ కపూర్. తల్లి శ్రీదేవి మాదిరిగా కెరీర్ ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్న జాన్వీ తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి కొరటాల శివ తెరకెక్కించనున్న తాజా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల తెలిపారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించనుండగా ఈ క్రేజీ ప్రాజక్ట్ ని మార్చి 23న గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీ కావడంతో పాటు తెలుగులోకి తొలిసారిగా ఎంట్రీ ఇస్తుండడంతో హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. తాజాగా ఒక మీడియా సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే దర్శకడు కొరటాల శివ కి పలుమార్లు మెసేజ్ చేసానని, రెఫరెన్స్ లు ప్రిపరేటరీ షూట్స్ కోసం ఆయనని అడుగుతున్నానని అన్నారు. ఆ విధంగా మూవీ షూట్ కోసం తాను రోజులు లెక్కిస్తున్నానని, ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ మరొక్కసారి చూడడంతో పాటు అందులోని తన అభిమాన ఎన్టీఆర్ తో యాక్ట్ చేయడం కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :