ఆ డీఫ్‌ ఫేక్‌ ఫోటో పై జాన్వీ కపూర్ కామెంట్స్ !

Janhvi-Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ‘పెద్ది’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఐతే, డీఫ్‌ ఫేక్‌ కారణంగా 15 ఏళ్ల వయసులో తనకొక చేదు సంఘటన ఎదురైందని తాజాగా జాన్వీ కపూర్‌ ఓ పాడ్‌ కాస్ట్‌ లో చెప్పుకొచ్చింది. ఇంతకీ, జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ‘నా 15 ఏళ్ల వయసులో నాకు ఓ చేదు ఘటన ఎదురైంది. ఓ అశ్లీల వెబ్‌సైట్‌లో ఎవరో నా డీఫ్‌ ఫేక్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేశారు. అప్పుడు నేను స్కూల్‌లో చదువుకుంటున్నాను’ అని జాన్వీ కపూర్ తెలిపింది.

జాన్వీ ఈ విషయం పై ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ అశ్లీల వెబ్‌ సైట్‌ లో నా ఫొటో చూసినట్లు ఓ ఫ్రెండ్ చెప్పారు. అప్పుడేం చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ, ఆ ఫోటో చూసి అప్పట్లో నేనెంతో బాధపడ్డాను. అప్పుడే నాకు అర్ధం అయింది, సోషల్‌ మీడియాలో నైతికత లేదని అర్థమైంది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎన్నో చూడాల్సి వస్తోంది అని నేను అప్పుడే భావించాను. అందుకే, నేను ఎక్కువగా డీఫ్‌ ఫేక్‌ ఫోటోలను పట్టించుకోను’ అని జాన్వీకపూర్‌ అన్నారు.

Exit mobile version