‘కాంతారా’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్ …. ఏమన్నారంటే

‘కాంతారా’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్ …. ఏమన్నారంటే

Published on Dec 17, 2022 12:12 AM IST

కన్నడలో తెరకెక్కి అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టిన తాజా కన్నడ మూవీ కాంతారా, అనంతరం తెలుగు సహా అనేక భాషల్లో ఇటీవల రిలీజ్ అయి అన్నింటా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి పై సర్వత్రా ప్రసంశలు కురుస్తూనే ఉన్నాయి. డివైన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచిన కాంతారా లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

అయితే విషయం ఏమిటంటే, నేడు కాంతారా మూవీ పై తన అధికారిక ఇన్స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ప్రసంశలు కురిపించారు దివంగత దిగ్గజ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. సినిమా ఆద్యంతం అభూతంగా ఆకట్టుకుందని అలానే కాంతారా హీరో, దర్శకడు అయిన రిషబ్ శెట్టి గురించి ఏమి చెప్పినా ఎంత చెప్పినా తక్కువే అని, హ్యాట్సాఫ్ టూ రిషబ్ శెట్టి అంటూ జాన్వీ కపూర్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు