ఎన్టీఆర్ పాత్రని ట్రాప్ చేయనున్న జాన్వీ కపూర్

Published on Jun 5, 2023 7:01 am IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఐతే, ఈ సినిమాలో జాన్వీ ఓ మత్స్యకారుని కూతురిగా నటిస్తోందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇప్పుడు జాన్వీ కపూర్ పాత్ర గురించి మరో అప్ డేట్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ ఓ రా ఏజెంట్ అని, ఎన్టీఆర్ పాత్రను ట్రాప్ చేయడానికి ఆమె ఓ మత్స్యకారునిగా నటిస్తోందని తెలుస్తోంది.

ఇక జాన్వీ అన్నింటికంటే ఈ ప్రాజెక్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. డేట్స్ కూడా ఈ సినిమాకి ఎక్కువ కేటాయించింది. ఈ చిత్రం జాన్వీకి తొలి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమా కోసం జాన్వీ చాలా ఉత్సాహంగా ఉందట. ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది.

అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :