‘పుష్ప రాజ్‌’కు ఫిదా అయిన జాన్వీ కపూర్‌ !

Published on Jan 10, 2022 11:34 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప- ది రైజ్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ లో ‘పుష్ప’ అందర్నీ ఆకట్టుకుంటుంది. హిందీ స్టార్‌ హీరోలు, ప్రొడ్యూసర్లతో పాటు హీరోయిన్లు కూడా పుష్పకి, పుష్ప రాజ్‌ కు ఫిదా అయిపోతున్నారు.

తాజాగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్‌ కూడా పుష్పరాజ్‌ పై మనసు పారేసుకుంది. పుష్ప సినిమాని చూసాకా, మెచ్చుకోకుండా ఉండలేకపోయిందట. అందుకే.. వెంటనే.. సోషల్‌ మీడియాలో పుష్ప సినిమా పై, అలాగే అల్లు అర్జున్‌ నటన పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘ప్రపంచంలోనే కూలెస్ట్‌ మ్యాన్‌’ అంటూ చిన్న స్టోరీ కూడా పెట్టింది జాన్వీ కపూర్‌.

మొత్తానికి ‘పుష్ప థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సక్సెస్‌ ఫుల్ గా దూసుకుపోతోంది. ఇక థియేటర్‌లో ఈ సినిమా చూడని చాలామంది అమెజాన్‌ ప్రైమ్‌లో చూస్తున్నారు. అన్నట్టు అర్జున్‌ కపూర్‌ కూడా ఈ సినిమా చూసి స్పందిస్తూ.. పుష్ప అంటే నిజంగా ఫైరే అని తన ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :