వావ్ : ‘ఆర్ఆర్ఆర్’ చూసేందుకు ఏకంగా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన జపాన్ ఫ్యాన్స్

వావ్ : ‘ఆర్ఆర్ఆర్’ చూసేందుకు ఏకంగా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన జపాన్ ఫ్యాన్స్

Published on Nov 24, 2022 1:47 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత మూవీ ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అయి మన దేశంతో పాటు అనేక దేశాల ఆడియన్స్ ని, సినీ ప్రముఖుల్ని సైతం ఆకట్టుకుని గ్లోబల్ గా అటు భారీ కలెక్షన్స్ తో పాటు సూపర్ క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీని ఇటీవల జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేసారు మేకర్స్.

ఇక అక్కడ విడుదల సందర్భంగా హీరోలిద్దరితో పాటు రాజమౌళి కూడా ప్రత్యేకంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేసారు. అయితే విషయం ఏమిటంటే, అక్కడ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండి సూపర్ గా కలెక్షన్స్ తో క్రేజ్ తో దూసుకెళుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇక తాజాగా ఈ అద్భుత మూవీ కోసం కొందరు జపనీస్ ఫ్యాన్స్ ఏకంగా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసారు. మొత్తంగా దీనిని బట్టి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కి ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో ఎంతటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ మ్యాటర్ ని కొద్దిసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ టీమ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి తమ సినిమా పై ఫ్యాన్స్ కురిపిస్తున్న ప్రేమకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు