‘జవాన్, ఇంద్రసేన’ కృష్ణా జిల్లా కలెక్షన్లు !
Published on Dec 4, 2017 9:36 am IST

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘జవాన్’ చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ సాదించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత శని, ఆదివారాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యొక్క హవా కనబడింది. చాలా ఏరియాల్లో మంచి వసూళ్లను రాబట్టుకుందీ చిత్రం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రెండు రోజులకు రూ.31.40 లక్షల షేర్ ను రాబట్టి 3వ రోజు ఆదివారం రూ.16.56 లక్షలను ఖాతాలో వేసుకుని మొత్తంగా రూ.47.97 లక్షలను రాబట్టుకుంది.

అలాగే విజయ్ ఆంటోనీ నటించిన ‘ఇంద్రసేన’ చిత్రం గురువారం విడుదలై యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే ఆదివారం రూ.3.2 లక్షల నెట్ తో రూ.3.93 లక్షల షేర్ ను రాబట్టిన ఈ సినిమా మొత్తంగా రూ.10.02 లక్షల నెట్ తో రూ. 12.32 లక్షల గ్రాస్ ను నమోదుచేసింది.

 
Like us on Facebook