యువ హీరో సినిమా రిలీజ్ డేట్ పై రేపు క్లారిటి !

యువ హీరో సాయిధరమ్ తేజ్ ఈ మద్య నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయం సాదించలేదు. దీంతో ఈసారి ‘జవాన్’ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడాయన. రచయిత బి.విఎస్ రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలో మొదటి పాట విడుదల అయ్యింది, రెండో పాట రేపు విడుదల చెయ్యనున్నారు. సినిమా విడుదల విషయంలో రకరకాల డేట్స్ వినిపించాయి, కానీ రేపు అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్సు చెయ్యనున్నారు చిత్ర నిర్మాతలు

‘కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత’ అనే డైలాగ్ తో విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్ని మాత్రమే చేసిన సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో తేజ్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ నటించింది.