“జవాన్” కి కూడా “జైలర్” తరహాలోనే..!

Published on Sep 2, 2023 3:00 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన కోలీవుడ్ భారీ కం బ్యాక్ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. మరి సౌత్ లో అయితే బిగ్గెస్ట్ హిట్ అండ్ భారీ లాభాలు అందించిన సినిమాగా ఇది నిలవగా ఈ చిత్రం తర్వాత ఇక బాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా “జవాన్” పై అయితే అందరి కళ్ళు ఉన్నాయి.

మరి ఇప్పుడు ఈ రెండు చిత్రాలకి కూడా ఓ అంశం ఇంట్రెస్టింగ్ గా కలిసింది అని చెప్పొచ్చు. ఈ చిత్రాలు రెండిటికి కూడా టీజర్ సాంగ్స్ వరకు ఉన్న హైప్ వేరు ఒక్కసారిగా ట్రైలర్ తర్వాత వచ్చిన హైప్ క్లియర్ గా వేరే అని చెప్పాలి. జైలర్ కి అప్పటివరకు ఓ మోస్తరు గానే ఉన్న అంచనాలు ఒక్కసారిగా ట్రైలర్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో పైకి లేవగా నిన్న వచ్చిన జవాన్ పరిస్థితి కూడా అంతే అని చెప్పొచ్చు.

అంతకు ముందు వరకు షారుఖ్ పఠాన్ హిట్ తర్వాత సినిమా అని హైప్ ఉంది కానీ ఈ ట్రైలర్ చూసాక మాత్రం పఠాన్ ని మించి ఈ సినిమా వెళ్ళిపోతుంది అని ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ అయ్యిపోయింది. దీనితో ఈ సినిమాల విషయంలో ట్రైలర్స్ చాలా కీలక పాత్ర పోషించాయి అని చెప్పొచ్చు. అలాగే ఈ రెండు సినిమాలకి కూడా అనిరుద్ నే సంగీతం ఇవ్వడం విశేషం.

సంబంధిత సమాచారం :