ఓటిటి : “జవాన్” కి కూడా “పఠాన్” తరహాలోనే.!

Published on Sep 17, 2023 7:11 pm IST


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సెన్సేషనల్ చిత్రం “జవాన్” తో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ ని అందుకున్నాడు. మరి దీనికి ముందు చేసిన “పఠాన్” కూడా భారీ హిట్ కాగా షారుఖ్ అయితే రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ ని తాను అందుకున్నాడు. ఇక ఇప్పుడు జవాన్ భారీ వసూళ్లు కొల్లగొడుతూ ఉండగా ఇప్పుడు జవాన్ ఓటిటి విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ అయితే వినిపిస్తుంది.

దీనితో జవాన్ సినిమా ఓటిటి లో రిలీజ్ అప్పుడు దీని ఎక్స్ టెండెడ్ వెర్షన్ ని మేకర్స్ రిలీజ్ చేస్తారట. అంటే థియేట్రికల్ గా చూసిన దానికంటే ఎక్కువ నిడివితో ఓటిటి లో అదనపు సీన్స్ తో వస్తుంది అని చెప్పాలి. మరి ఇదే ఫార్మాట్ లో లాస్ట్ టైం పఠాన్ ని కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ జవాన్ ని కూడా ఇదే తరహాలో తీసుకొస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా రెడీ చిల్లీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :