యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఎంటర్టైనర్ చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం యూఎస్ లో అయితే నవీన్ కెరీర్ లోనే పెద్ద హిట్ దిశగా మరింత స్థాయిలో దూసుకెళ్తుండగా యూఎస్ లో అయితే ఈ సినిమా అదిరే పెర్ఫామెన్స్ ని కనబరుస్తుంది.
లేటెస్ట్ గా గడిచిన వారం టాప్ 20 చిత్రాల లిస్ట్ లో అయితే టాప్ 20 చిత్రాల్లో ఒకటిగా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అలాగే బాలీవుడ్ భారీ హిట్ షారుఖ్ ఖాన్ నటించిన “జవాన్” చిత్రాలు నిలిచాయి. మరి జవాన్ సినిమా అయితే యూఎస్ మార్కెట్ లో టాప్ 6 లో నిలవగా మిస్ శెట్టి 18వ స్థానంలో నిలిచింది. ఇక మిగతా మొత్తం హాలీవుడ్ సినిమాలు ఉండగా ఇండియా నుంచి ఈ రెండే ఉన్నాయి.