“గదర్ 2” లైఫ్ టైం వసూళ్లు బ్రేక్ చేసేసిన “జవాన్”

Published on Sep 23, 2023 3:23 pm IST

ఇప్పుడు బాలీవుడ్ సినిమా మళ్ళీ తమ కం బ్యాక్ ఇచ్చి భారీ హిట్స్ ని బాక్సాఫీస్ దగ్గర డెలివర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి గడిచిన ఈ రెండు మూడు నెలల్లోనే సెన్సేషనల్ హిట్స్ బాలీవుడ్ నుంచి రాగా వాటిలో హీరో సన్నీ డియోల్ నటించిన చిత్రం “గదర్ 2” ఇన్నేళ్ల తర్వాత వచ్చి హిందీలో రికార్డులు తిరగరాసింది. అలాగే బాలీవుడ్ లో అయితే కేజీఎఫ్ 2 ని కూడా బ్రేక్ చేసి బాహుబలి 2 వరకు వెళ్ళింది.

అయితే ఈ గదర్ 2 వసూళ్ళని అయితే గ్లోబల్ వైడ్ గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం “జవాన్” ఇప్పుడు జస్ట్ ఇండియా వసూళ్లతోనే బద్దలుకొట్టేసింది. గదర్ 2 కి వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 522 కోట్లు గ్రాస్ రాగా దీనిని జవాన్ జస్ట్ ఇండియాలో 528.39 కోట్ల గ్రాస్ వసూళ్లతో మూడో వారాంతానికే బ్రేక్ చేసి సత్తా చాటింది. దీనితో షారుఖ్ బాక్సాఫీస్ పొటెన్షియల్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ 937 కోట్లకి పైగా రాబట్టిన జవాన్ ఇప్పుడు 1000 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తుంది.

సంబంధిత సమాచారం :