‘జవాన్’ విడుదల తేది ఖరారు !
Published on Oct 21, 2017 11:50 am IST


కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత.’ అంటూ సాయిధరమ్‌ తేజ్ ‘జవాన్’ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బివిఎస్ రవి దర్శకత్వంలో వస్తున్న ‘జవాన్’ సినిమా లో మెహరిన్ హీరొయిన్ గా నటిస్తుంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 1న భారీగా విడుదల చెయ్యబోతున్నారు. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చితాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకుందాం.

 
Like us on Facebook