‘జవాన్’ ఐదు రోజుల కలెక్షన్ డీటెయిల్స్

Published on Sep 12, 2023 9:00 pm IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార, దీపికా పదుకొనె హీరోయిన్స్ గా యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ జవాన్. సరిగ్గా ఐదురోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని మంచి కలెక్షన్ ని అందుకుంటూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.

రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పై గౌరి ఖాన్ నిర్మించిన జవాన్ కి అనిరుద్ సంగీతం అందించారు. ఇక గడచిన ఐదు రోజుల్లో జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 574.89 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మరి రాబోయే రోజుల్లో జవాన్ మూవీ ఇంకెంత మేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :