ఇండియాలో “జవాన్” హిస్టారికల్ రన్ కంటిన్యూ.!

Published on Sep 16, 2023 2:00 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “జవాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం అంతే రీతిలో అంచనాలు అందుకొని బాలీవుడ్ లో అయితే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ అందుకుంది. అంతే కాకుండా ఏ బాలీవుడ్ సినిమా కూడా అందుకోని ఓపెనింగ్స్ ని సౌత్ లో కూడా అందుకుంది.

మరి అలా ఈ చిత్రం ఇప్పటికీ హిస్టారికల్ రన్ ని కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇండియాలో నిన్న గురువారం వసూళ్లు 20 కోట్లకి పైగా గ్రాస్ తో 348 కోట్ల మేర రికార్డు గ్రాస్ దగ్గరకు రాగ తమిళ్ మరియు తెలుగులో ఈ చిత్రం ఇప్పటివరకు 43 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. మొత్తానికి ఇండియా వైడ్ మాత్రం హిస్టారికల్ రన్ ని ఈ సినిమా కంటిన్యూ చేస్తుంది. ఇక వీకెండ్ కి అయితే ఈ వసూళ్లు మరింత భారీ స్థాయిలో పెరగనున్నాయి అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :