బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “జవాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి నయనతార అలాగే దీపికా పదుకోన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా షారుఖ్ కెరీర్ లో ఫాస్టెస్ట్ అండ్ హైయెస్ట్ రికార్డులు నమోదు చేస్తుండగా ఈ చిత్రం అయితే ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ ని సెట్ చేసింది.
ఇక ఈ చిత్రం అయితే మళ్ళీ షారుఖ్ కెరీర్ లో మరో 1000 కోట్ల గ్రాసర్ గా దూసుకెళ్తుండగా లేటెస్ట్ గా అయితే మరో సెన్సేషనల్ ఫీట్ ని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి గ్లోబల్ గా అయితే వవ చిత్రం ఇపుడు గడిచిన వీకెండ్ లో టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది. మరి మొదటి రెండు స్థానాల్లో కూడా హాలీవుడ్ చిత్రాలు “ది నన్ 2” అలాగే హంటింగ్ ఇన్ వెనిస్ లు నిలవగా వాటి తర్వాత హైయెస్ట్ వసూళ్లు అందుకున్న ఏకైక ఇండియన్ సినిమాగా జవాన్ నిలిచింది. అంతే కాకుండా వరల్డ్ వైడ్ మొత్తం 100 మిలియన్ డాలర్స్ తో 800 కోట్ల క్లబ్ లో కూడా ఇది చేరిన సంగతి తెలిసిందే.