తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ సృష్టించిన “జవాన్”

Published on Sep 9, 2023 2:01 am IST

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం దాదాపు 9 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.

బాలీవుడ్ సినిమాకి ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రికార్డ్ లేదు. షారుఖ్ ఖాన్ ఈ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సంజయ్ దత్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :