“జవాన్” నాన్ థియేట్రికల్ పార్ట్ నర్స్ ఇవే!

Published on Sep 7, 2023 10:00 am IST


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ నేడు థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ ను భారీగా రాబట్టనుంది. ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ పార్ట్ నర్ లను ఫిక్స్ చేసుకుంది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి ఛానెల్ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు సినిమా కి సంబందించిన శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. దీపికా పదుకునే గెస్ట్ రోల్ లో నటించింది. ఈ చిత్రం డే 1 భారీగా వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :