హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘జవాన్’ టికెట్స్

Published on Sep 7, 2023 2:02 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పై గౌరి ఖాన్ భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ జవాన్. ఈమూవీని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన జవాన్ మూవీ సెప్టెంబర్7న అనగా రేపు పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక ఈ మూవీ యొక్క యుఎస్ఏ ప్రీ సేల్స్ ఇప్పటికే సూపర్ గా ఉండగా మరోవైపు మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ఇతర రాష్ట్రాలలో సైతం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పివిఆర్, ఐమ్యాక్స్, సినీ పోలీస్ వంటి మల్టి ప్లెక్స్ చైన్స్ లో కూడా జవాన్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఇక దీనిని బట్టి చూస్తుంటే జవాన్ మూవీ ఫస్ట్ డే భారీ స్థాయి కలెక్షన్ ని సొంతం చేసుకునే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న జవాన్ ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :