వరల్డ్ వైడ్ “జవాన్” సునామితో మరో రికార్డు మైల్ స్టోన్.!

Published on Sep 20, 2023 4:00 pm IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార మరియు దీపికా పదుకోన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “జవాన్”. మరి భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి షారుఖ్ గత చిత్రం పఠాన్ రికార్డులని ఏడాది తిరక్కుండానే బ్రేక్ చేసి బాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా దూసుకెళ్తుంది.

మరి ఈ సినిమా కూడా 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది అని ముందే ట్రేడ్ వర్గాలు అంచనాలు వేయగా ఇప్పుడు ఆ దిశగా వెళ్తూ ఒకో రికార్డు క్రాస్ చేస్తుంది. అలా లేటెస్ట్ గా జవాన్ అయితే వరల్డ్ వైడ్ 900 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం జవాన్ 907.54 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. దీనితో మరికొన్ని రోజుల్లనే జవాన్ ఏకంగా 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :