సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ‘జవాన్’

Published on Sep 3, 2023 1:34 am IST

బాలీవుడ్ తో సహా ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమానే “జవాన్”. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైన ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజైంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఈ నేపథ్యంలో మేకర్స్ ‘జవాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ఐతే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘జవాన్’ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. నేషనల్ వైడ్ ఉన్న ఎగ్జిబిటర్స్ లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయటం ఓ హిస్టరీ అని ఎగ్జిబిటర్స్ మాట్లాడుకోవటం విశేషం. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం :