“జవాన్” అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

Published on Sep 1, 2023 4:01 pm IST

ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో జవాన్ కూడా ఒకటి. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ మరియు నయనతార జంటగా నటించారు. సెప్టెంబర్ 7, 2023న విడుదల కానున్న ఈ బిగ్గీలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించారు. భారతదేశంలో ఈ చిత్రానికి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని మేకర్స్ ఇప్పుడు ప్రకటించారు.

మంచి ప్రమోషన్ల కారణంగా సినిమా టికెట్స్ హాట్‌కేక్‌ల వలె అమ్ముడవుతాయని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, సన్యా మల్హోత్రా మరియు ఇతర నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్‌ హౌజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ బిగ్గీకి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు.

సంబంధిత సమాచారం :