తెలుగు రాష్ట్రాల్లో జయ జానకి నాయక తొలిరోజు వసూళ్లు
Published on Aug 12, 2017 4:42 pm IST


యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్లుగా నటించిన జయ జానకి నాయక చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. తొలిరోజు ఈచిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.25 కోట్ల షేర్ ని ఈ చిత్రం సాధించడం విశేషం. మాస్ చిత్రాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటికి ఉన్న మాస్ బ్రాండ్ ఇమేజ్ ఈ చిత్రానికి ఉపయోగపడింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.

 
Like us on Facebook