‘జయ జానకి నాయక’ మొదటి వారం వసూళ్ళ పూర్తి వివరాలు !
Published on Aug 22, 2017 12:02 am IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను నుండి వచ్చిన తాజా చిత్రం ‘జయ జానకి నాయక’ వసూళ్ల పరంగా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది. ముఖ్యంగా బి, సి సెంటర్లో సినిమాకు మంచి ఆదరణ దొరుకుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు రాబడుతుండగా నైజాం ఏరియాలో మొదటి వారంలో అత్యధికంగా రూ.5.42 కోట్లు రాబట్టి ఇతర ఏరియాల్లో కూడా మంచి రన్ చూపించింది. ఈ చిత్రంతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మొదటి భారీ కమర్షియల్ హిట్ ను అందుకున్నట్లైంది.

మొదటి వారంలో ఏరియాల వారీగా వసూళ్లను పరిశీలిస్తే

ఏరియా కలెక్షన్లు
నైజాం    5. 42 కోట్లు
సీడెడ్ 2.97 కోట్లు
నెల్లూరు 69 లక్షలు
గుంటూరు 1. 38 కోట్లు
కృష్ణా 88 లక్షలు
వెస్ట్ 1.03 కోట్లు
ఈస్ట్ 1.09 కోట్లు
వైజాగ్ 2.06 కోట్లు
మొత్తం 15.52 కోట్లు

 
Like us on Facebook