నైజాంలోనే కోటి కొల్లగొట్టిన ‘జయ జానకి నాయక’


‘జయ జానకి నాయక’ చిత్రం రూపంలో బోయపాటి శ్రీను మరో మాస్ యాక్షన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. బోయపాటి తదైన శైలిలో యాక్షన్, ఎమోషన్ తో తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బెల్లం కొండా శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రంలో నటించాడు. బోయపాటి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది.

కేవలం నైజాం ఏరియాలోనే ఈచిత్రం రూ కోటి షేర్ సాధించడం విశేషం. బెల్లం కొండ శ్రీనివాస్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్ నటించారు. జగపతి బాబు, సుమన్ అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాధ్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది. మాస్ కి చేరువయ్యే అన్ని అంశాలు ఈ చిత్రంలో మేళవించడంతో రాబోవు రోజుల్లో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.