మహేష్, దీపికా పదుకొనేలతో ‘ఫిదా’…ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన డైరెక్టర్ జయంత్

Published on Jun 3, 2023 4:00 pm IST

టాలీవుడ్ లో దర్శకుడిగా ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సంపాదించుకుని పలు సక్సెస్ లతో దూసుకెళ్లిన ఒకప్పటి దర్శకుల్లో జయంత్ సి పరాన్జీ కూడా ఒకరు. తొలిసారిగా వెంకటేష్, అంజలా ఝవేరి హీరో హీరోయిన్స్ గా 1997లో తెరకెక్కిన ప్రేమించుకుందాం రా మూవీతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టి ఫస్ట్ మూవీతోనే పెద్ద సక్సెస్ అందుకున్న జయంత్ ఆ తరువాత ఇతర స్టార్స్ లో కూడా సినిమాలు తీశారు. ఇక తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా జయంత్ మాట్లాడుతూ, 2017లో వరుణ్ తేజ్, సాయి పల్లవిల కలయికలో వచ్చిన ఫిదా మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అంతకముందు సూపర్ స్టార్ మహేష్ తో టక్కరిదొంగ వంటి కౌబాయ్ మూవీ తీసిన జయంత్, ఆ తరువాత ఒకానొక సమయంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన వద్దకు వచ్చి ఫిదా స్టోరీ చెప్పారని అన్నారు.

అలానే ఆ మూవీని ఆయన మహేష్ బాబు కోసం రాసుకున్నారని తెలిపారు. అయితే అన్ని కుదిరితే మహేష్ బాబుకి జోడీగా దీపికా పదుకొనె ని తీసుకుని శేఖర్ డైరెక్టర్ గా నేను ఆ మూవీని నిర్మిద్దాం అనుకున్నాను అన్నారు జయంత్. మహేష్ కి కూడా కథ చెప్పగా ఆయన కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యారని అన్నారు. కానీ ఇక్కడి ఆడియన్స్ సూపర్ స్టార్డం ఉన్న హీరోల నుండి ఒకరకమైన సినిమాలు ఆశిస్తారని, అందుకే ఆ తరువాత కొంత ఆలోచన చేసి ఆ ప్రాజక్ట్ మహేష్ కి సరిపోదు అనే విషయాన్ని శేఖర్ కమ్ములకి చెప్పానని తెలిపారు. అనంతరం దానిని వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో తీసి శేఖర్ సూపర్ హిట్ అందుకున్నారని అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు జయంత్ సి పరాన్జి.

సంబంధిత సమాచారం :