మనసుకు చాలా కష్టం గా ఉంది – జయప్రద

Published on Nov 7, 2021 4:00 pm IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ప్రేక్షక హృదయాలను కలిచి వేసింది. అతి పిన్న వయసులోనే ఆయన మరణించడంతో తోటి సినీ తారలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పునీత్ అంత్యక్రియలకు హాజరు కాని కొందరు సినీ ప్రముఖులు బెంగళూరులో పునీత్ గృహానికి చేరుకొని నివాళులర్పిస్తున్నారు. రామ్ చరణ్, సూర్య ఇటీవల శివరాజ్ కుమార్ ను ఓదార్చారు.

తాజాగా సీనియర్ హీరోయిన్ జయప్రద పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు. బాగా ఎమోషనల్ అయిన జయప్రద మాట్లాడుతూ.. ‘పునీత్ మన మధ్యలేడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. నా మనసుకు ఇది చాలా కష్టం గా ఉంది. ఎందుకంటే.. రాజ్ కుమార్ గారి కుటుంబం అంటే.. నా కుటుంబమే. పునీత్ ఎంతో గొప్పనటుడిగా, గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి అప్పు చిన్న వయసులోనే మనల్ని విడిచి వెళ్ళిపోయాడంటే.. మనసుకు చాలా కష్టంగా ఉంది. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని జయప్రద తెలిపారు.

సంబంధిత సమాచారం :