సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘పండంటి కాపురం’. ఈ చిత్రంలో ఎస్వి రంగారావు, గుమ్మడి, సరోజని దేవి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై జూలై 21వ తేదికి 42 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సహజనటి జయసుధ తన మిత్రులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి జయప్రద, దర్శకురాలు శ్రీప్రియ, రాధిక, నరేష్ తదితరులు హాజరయ్యారు.
‘పండంటి కాపురం’ సినిమాకు, జయసుధకు సంబంధం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? ఈ సినిమాతోనే జయసుధ వెండితెర రంగప్రవేశం చేశారు. బాలనటిగా ‘పండంటి కాపురం’ సినిమాలో నటించారు. ఈ సినిమాతోనే సీనియర్ హీరో, నటుడు నరేష్ కూడా బాల నటుడిగా తెరంగేట్రం చేశారు.
1972లో విడుదలైన సినిమాలలో ‘పండంటి కాపురం’ బిగ్గెస్ట్ హిట్. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతాల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు లక్ష్మి దీపక్ దర్శకత్వం వహించారు. జయప్రద పిక్చర్స్ బ్యానర్ పై హనుమంతరావు నిర్మించారు.
