చరణ్ తో ప్రాజెక్ట్ నా డ్రీం..”జెర్సీ” దర్శకుడు.!

Published on Mar 17, 2022 2:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ లో తన సినిమాలతో టాలీవుడ్ వీక్షకులకు ఒక మర్చిపోలేని అనుభూతిని కొన్నాళ్ల వరకు కలుగజేసే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా ఒకరు. తాను చేసింది రెండు సినిమాలే అయినా మరో 20 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుకునే తెలుగు సినిమా గర్వించదగే చిత్రాలను అందించాడని చెప్పడంలో సందేహం లేదు.

మరి వీటిలో నాచురల్ స్టార్ నాని తో చేసిన “జెర్సీ” సక్సెస్ తో అయితే తాను ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడుగా కూడా మారాడు. మరి ఇలాంటి దర్శకునితో మన స్టార్ హీరోల సినిమాలు అంటే ఎగ్జైటింగ్ గానే ఉంటాయి కదా.. అలానే ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఆ ఎగ్జైట్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమా భారీ స్థాయిలో తనతో సినిమా చేయనున్నాడు. మరి దీనిపైనే ఈ దర్శకుడు ఆసక్తికర రిప్లై ఇవ్వడం జరిగింది. తన బెస్ట్ వర్క్ ని ఈ సినిమాకి అందిస్తానని చరణ్ తో సినిమా నా డ్రీం అని కూడా తెలిపాడు. దీనితో ఈ ట్వీట్ చూసి చరణ్ ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :