పింక్ రీమేక్ లో తాప్సీ పాత్రలో జెర్సీ హీరోయిన్ ఫిక్స్ !

Taapsee

తల అజిత్ ,పింక్ రీమేక్ లో నటించనున్నాడని తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా ‘పింక్’ ను తమిళ్లో రీమేక్ చేయనున్నాడు దర్శకుడు హెచ్ వినోత్. ఒరిజినల్ వెర్షన్ లో తాప్సీ పన్ను చేసిన పాత్రను కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ చేయనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఆ పాత్ర ను చేయడానికి శ్రద్ధ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఈరీమేక్ లో బాలీవుడ్ నటి విద్యా బాలన్ ముఖ్యమైన పాత్రలో నటించనుంది. ఒరిజినల్ వెర్షన్ లో లేని పాత్రను వినోత్ ఈ రీమేక్ లో యాడ్ చేస్తున్నాడట ఆ పాత్రనే విద్యా బాలన్ చేయనుంది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న ఈచిత్రం యువన్ శంకర్ రాజా ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం అజిత్ జన్మదినం సందర్భంగా మే 1 న విడుదలకానుంది.

Exit mobile version