ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో “జెర్సీ”..!

Published on Oct 26, 2021 3:00 am IST

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం తాజాగా న్యూఢిల్లీలో జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం జాతీయ చలనచిత్ర అవార్డులను అందజేశారు. వివిధ విభాగాలకు సంబంధించి అవార్డులను ప్రధానం చేయగా నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ” కూడా రెండు అవార్డులను సొంతం చేసుకుంది.

ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో ‘జెర్సీ’ అవార్డులను గెలుచుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఉప రాష్ట్రపతి వెంకయ్య చేతుల మీదుగా ఈ అత్యున్నత గౌరవాలను అందుకున్నారని అన్నారు. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు కాగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును

సంబంధిత సమాచారం :