ఇంటర్వ్యూ : శ్రద్ధ శ్రీనాథ్ – అద్భుతమైన భావోద్వేగాల సమ్మేళనం !

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘జెర్సీ’. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది. ఈ కాగా ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారు ?

అవును. నాకు తెలుగు బాగానే అర్ధమవుతుంది. నేను సికిందరాబాద్ లో సిక్స్ ఇయర్స్ ఉన్నాను. నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. మా ఫాదర్ ఆర్మీలో పని చేస్తారు. ఆయన ఉద్యోగ రీత్యా నా బాల్యం ఆరు సంవత్సరాలు సికిందరాబాద్ తో ముడిపడి ఉంది. మా నేటివ్ ప్లేస్ అయితే బెంగుళూరు. ప్రస్తుతం మేము అక్కడే ఉంటున్నాము.

జెర్సీ సినిమా కాకుండా వేరే సినిమాలు కూడా చేస్తున్నట్లు ఉన్నారు ?

చేస్తున్నాను అవి జెర్సీ సినిమా కంటే ముందు అంగీకరించినవి. అందులో ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న ‘జోడి’ ఒకటి. 2017లో ఆ మూవీకి సైన్ చేశాను. కానీ లేట్ గా మొదలయింది. అలాగే సురేష్ ప్రొడెక్షన్స్ ల క్షణం డైరెక్టర్ రవికాంత్ సినిమా కూడా చేస్తున్నాను.

టాలీవడ్ లో కి ఎంట్రీ ఇచ్చే ముందు తెలుగు సినిమాలు ఏమైనా చూసారా ?

పెళ్లి చూపులు చూసాను, అలాగే బాహుబలి సిరీస్ కూడా చూసాను. ప్రస్తుతం టాలీవుడ్ ని కూడా ఫాలో అవుతున్నాను.

మీరు జెర్సీ సినిమా కథ మొత్తం విన్నారా ?

కథ మొత్తం అంటే.. దాదాపు విన్నాను. అలాగే కథలో నా పాత్రకి ఉన్న ప్రాముఖ్యత కూడా నాకు బాగా సంతృప్తినిచ్చింది. అందుకే ఏమి ఆలోచించకుండా వెంటనే ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను.

నానికి పోటీగా నటించి మెప్పిస్తే గాని పేరు రాదు ? మరి నానికి దీటుగా నటించారా ?

నా పాత్ర పరిధి మేరకు నేను బాగానే నటించాననుకుంటున్నాను, ఎందుకంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ ని. నాకు యాక్టింగ్ ఎప్పుడూ ప్రోబ్లం కాదు. కాకపోతే తెలుగులో డైలాగ్ లు చెప్పే సందర్భంలో మాత్రం కొంతవరకు ఇబ్బందిగా అనిపించేది. ఆ సమయంలో నానిగారే చాలా బాగా హెల్ప్ చేశారు.

మొదటి సినిమాలోనే మదర్ రోల్ లో నటించడం రిస్క్ అనిపించలేదా ?

అలా ఏమి లేదు. ఈ సినిమాలో నాకు అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం వచ్చింది. అదే నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. పైగా సినిమాలో టీనేజర్ గా కూడా కనిపిస్తాను. అలాగే మదర్ గా కూడా. ఇలా ఒకే సినిమాలో వేరు వేరు దశలలో కనిపించడం రిస్క్ ఎలా అవుతుంది.

ఇంతకీ సినిమా ఎలా వచ్చింది ?

నేను సినిమా చూడలేదు. కానీ ఖచ్చితంగా చెప్పగలను. ‘జెర్సీ’ సినిమా అమోఘమైన భావోద్వేగాలతో అద్భుతంగా వచ్చింది. ప్రతి భర్తకు ప్రతి భార్యకు ఈ సినిమా నచ్చుతుంది. అదే విధంగా వారి హృదయాలను తాకుతుంది.

Exit mobile version