ట్రైలర్ తో ఆకట్టుకున్న షాహిద్ కపూర్ “జెర్సీ” ట్రైలర్!

ట్రైలర్ తో ఆకట్టుకున్న షాహిద్ కపూర్ “జెర్సీ” ట్రైలర్!

Published on Nov 23, 2021 8:49 PM IST


షాహిద్ కపూర్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జెర్సీ. గీతా ఆర్ట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్, దిల్ రాజు లు సంయుక్తం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు లో నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రానికి రీమేక్.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మృణల్ థకూర్, పంకజ్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్, సచెట్ పరంపర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండటం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు