షాహిద్ కపూర్ “జెర్సీ” ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్!

Published on Nov 22, 2021 2:00 pm IST

షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ఈ చిత్రం తెలుగు లో సూపర్ హిట్ సాధించిన జెర్సీ చిత్రానికి రీమేక్. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదల పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ ను రేపు సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. గీతా ఆర్ట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ మరియు సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్, దిల్ రాజు లు సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More