బిగ్ బాస్ 5: తను వెళ్తూ కుటుంబ సభ్యులను ఏడిపించిన జెస్సీ..!

Published on Nov 9, 2021 5:30 pm IST

స్టార్ మా లో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. టాస్క్ లతో కుటుంబ సభ్యుల మధ్య ఊహించని రీతిలో గొడవలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. అయితే హౌజ్ లో నామినేషన్ల ప్రక్రియ సైతం కుటుంబ సభ్యులను టెన్షన్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం హౌజ్ లో నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్లనున్నారు.

ఆరోగ్యం ఇంకా కుదుట పడక పోవడం తో జెస్సీ ను హౌజ్ నుండి బయటికి వెళ్ళాలి అంటూ బిగ్ బాస్ కోరడం జరిగింది. ఈ మేరకు జెస్సీ హౌజ్ లో నుండి వెళ్లాల్సి వచ్చింది. తను వెళ్తూ కుటుంబ సభ్యులను సైతం ఏడిపించాడు జెస్సీ. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్టార్ మా లో బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. శని మరియు ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More