OTTలో ‘జిగ్రీస్’ సందడి.. అమెజాన్, సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్!

ఓటీటీలో విడుదలైన అతి తక్కువ సమయంలోనే ‘జిగ్రీస్’ (Jigrees) సినిమా విశేష ఆదరణ పొందుతోంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ ద్వారా మిలియన్ల వ్యూస్ సాధించి, సోషల్ మీడియాలో ఈ సినిమా క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల తన తొలి ప్రయత్నంలోనే ఎంతో పరిణితితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మద్దతుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అటు యూత్‌ను, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తోంది.

నటుడు కృష్ణ బురుగుల తన కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నిర్మాత కృష్ణ వోడపల్లి, సహ నిర్మాత చిత్తం వినయ్ కుమార్ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు. చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్, ఈశ్వరదిత్య సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.

స్వచ్ఛమైన స్నేహానికి అద్దం పడుతూ, నవ్వుల జాతరను తలపిస్తున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదికలు ‘అమెజాన్ ప్రైమ్’ (Amazon Prime) మరియు ‘సన్ నెక్స్ట్’ (Sun NXT)లలో వీక్షించవచ్చు.

Exit mobile version