
గత కొద్ది రోజులుగా ప్రతి శుక్రవారం చిన్న చిన్న సినిమాలే తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కానీ ఈ వారం రెండు పెద్ద పెద్ద హీరోలు మరియు క్రేజున్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవే సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్’, గోపీచంద్ నటించిన ‘జిల్’ సినిమాలు. ఈ రెండు సినిమాలు మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మెగా కాంపౌండ్ నుంచి సాయి ధరమ్ తేజ్ ని పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. మరోవైపు లౌక్యం సినిమాతో హిట్ అందుకొని జోరు మీదున్న గోపీచంద్ తన లుక్ మొత్తాన్ని మార్చుకొని చేసిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జిల్’. రాధాకృష్ణ డైరెక్షన్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ పై చేసిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలకి పండుగ సీజన్స్ హెల్ప్ కానున్నాయి.
27న ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటే 28న శ్రీరామనవమి పండుగ ఉంది. రిలీజ్ అయిన రెండవ రోజే పూర్తి సెలవు దినం కావడంతో బాక్స్ ఆఫీసు వద్ద ఫుల్ కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు. అలాగే రెండవ వారం వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో సెకండ్ వీక్ కూడా బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ మొదటి వారంలో పెద్ద సినిమాలు ఏమీలేకపోవడంతో రెండు వారాల పాటు ఈ సినిమాలకి బాక్స్ ఆఫీసు వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఎంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనేది చూడాలి అంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే..