గోపీచంద్ ఈ సారి స్టైలిష్ గా కొట్టాడు..

Jil
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కి ‘లౌక్యం’ సినిమా ద్వారా ఎదురుచూస్తున్న విజయం లభించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కామెడీకి పెద్ద పీట వేసిన ఈ యాక్షన్ హీరో ఈసారి ‘జిల్’ సినిమాతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మనల్ని అలరించాడు. సినిమా మొదటి టిక్కెట్ తెగిన దగ్గరనుండీ ఇప్పటివరకూ మంచి పబ్లిక్ టాక్ తో హిట్ బాటలో దూసుకుపోతుంది.

సాదా సీదా స్టోరీ లైన్ ని స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన దర్శకుడి తోలిప్రయత్నమే అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దానికి తోడు రాశీ ఖన్నా అందాలు కూడా తోడవ్వడం అదనపు ఆకర్షణ. గతకొన్ని వారాలుగా పెద్ద సినిమాలు లేకపోవడం, త్రివిక్రమ్ బన్నీల సత్యమూర్తి వాయిదా పడుతుందంటూ వార్తలు రావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. వంశీ మరియు ప్రమోద్ లు నిర్మించిన ఈ సినిమాకు ఘిబ్రన్ సంగీత దర్శకుడు

Exit mobile version