పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను జియో హాట్‌స్టార్ ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 6న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుందనే వార్తతో అభిమానులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇక ఈ ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎక్స్టెండెడ్ వెర్షన్ అందుబాటులో ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.
దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలోకి రాగానే తమకు నోటిఫికేషన్ వచ్చేలా ‘రిమైండ్ మి’ బటన్లను క్లిక్ చేస్తున్నారు. ఈ ప్రభావంతో జియో హాట్‌స్టార్‌కు మునుపెన్నడూ లేనంత ట్రాఫిక్ వచ్చి పడిందని.. దీంతో తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేసిపెట్టి సిద్ధంగా ఉన్నట్లు జియో హాట్‌స్టార్ అధికారిక ప్రకటన చేసింది.
ఓటీటీలో రాజాసాబ్ స్ట్రీమింగ్కు రాకముందే ఈ పరిస్థితి ఉంటే, ఇక సినిమా వచ్చాక ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీ.జీ.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.
Thanks to all the fans for the love and support ♥️ #TheRajaSaabOnJioHotstar #TheRajaSaab #JioHotstar pic.twitter.com/YUoyYRUT2K
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 5, 2026
