చెన్నైలో ఎన్టీఆర్ హవా ఎలా ఉందంటే !
Published on Sep 24, 2017 12:07 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం గత గురువారం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. గడిచిన మూడు రోజుల కలెక్షన్లు కూడా మెరుగ్గానే ఉన్నాయి. తారక్ కెరీర్లో ఇవే బెస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే చెన్నైలో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోంది.

మొదటిరోజు చెన్నైలో రూ.16 లక్షల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం తమిళనాడు వ్యాప్తంగా రూ.72 లక్షల గ్రాస్ ను ఖాతలో వేసుకుంది. అలాగే రెండవ రోజుకు చేరేటప్పటికి ఈ గ్రాస్ మొత్తం రూ.1.1 కొట్లగా ఉంది. ఇక కేవలం చెన్నై సిటీలో రెండు రోజులకు రూ. 30 లక్షలు, మూడు రోజులకు రూ. 45 లక్షల గ్రాస్ ను నమోదుచేసింది. ఇక ఈరోజు ఆదివారం కాబట్టి కలెక్షన్లు ఇంకాస్త మెరుగ్గా ఉండే అవకాశముంది. డైరెక్ట్ తెలుగు సినిమాతోనే ఇంత మంచి వసూళ్లను రాబట్టిన తారక్ రాబోయే తన సినిమాల్ని తమిళంలో కూడా రూపొందిస్తే భవిష్యత్తులో మంచి మార్కెట్ ను స్థిరపరచుకోగలడనిపిస్తోంది.

 
Like us on Facebook