ఓవర్సీస్లో 1.5 మిలియన్ మార్కును దాటిన ‘జై లవ కుశ’ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జై లవ కుశ’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ప్రీమియర్లతోనే 5.5 లక్షల డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజుకి మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది. ఇక 1.28 మిలియన్లను చేరుకొన్న ఈ సినిమా ఆ తర్వాత మహేష్ ‘స్పైడర్’ రిలీజ్ తో కాస్త నెమ్మదించి 30 నాటికి 1.5 మిలియన్ మార్కును అధిగమించింది.

ప్రస్తుతం ఈ చిత్ర కలెక్షన్లు 1,503,000 గా ఉన్నాయి. ఈ చిత్రంతో తారక్ వరుసగా మూడు సార్లు 1.5 మిలియన్ ను మార్కును అందుకున్నట్లైంది. గతంలో ఆయన నటించిన ‘జనతా గ్యారేజ్ నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాలు కూడా ఈ మార్కును క్రాస్ చేశాయి. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో చేసిన ఈ చిత్రాన్ని ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించగా బాబీ దర్శకత్వం వహించారు,