ఓవర్సీస్లో ‘జై లవ కుశ’ మొదటి రోజు కలెక్షన్లు !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ ఎత్తున విడుదలైంది. 90 లొకేషనల్లో కలిపి సుమారు 500 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్సును రాబట్టింది. కేవలం ప్రీమియా షోల ద్వారానే 5.7 లక్షల డాలర్లను వసూలు చేసి మొదటి రోజు అనగా నిన్న 1.45 లక్షల డాలర్లను రాబట్టుకుంది.

దీంతో మొదటి రోజు సుమారు 7.2 లక్షల డాలర్ల పైనే ఖాతాలో వేసుకుంది. ఇక ‘స్పైడర్’ వచ్చే వరకు ఎలాంటి రిలీజ్ లేదు కనుక ఈ కలెక్షన్లు ఈ మూడు రోజులు ఇలాగే స్టడీగా కొనసాగే అవకాశముంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ స్థాయి వసూళ్లు నమోధై తారక్ గత సినిమాలు ఓపెనింగ్స్ రికార్డులన్నీ తిరగరాయబడ్డాయి.