ప్రమోషన్ కోసం అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్ హీరోయిన్లు

16th, September 2017 - 04:49:14 PM


ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ చిత్రం అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని సెప్టెంబర్ 21 న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఏ చిత్రం విడుదలైనా బిగ్ బాస్ హౌస్ లో ప్రచారం నిర్వహించుకోవడం చూస్తున్నాం. బిగ్ బాస్ తెలుగు షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

జై లవ కుశ ప్రచారం కోసం ఎన్టీఆర్ హీరోయిన్లు నివేద థామస్, రాశి ఖన్నా లు బిగ్ బాస్ లో మెరిశారు. బిగ్ బాస్ షో బుల్లి తెరపై సంచనలంగా మారిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే తొలిసారి జై లవ కుశ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశాడు. భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.