పైరసీని ఎంకరేజ్ చేయొద్దంటున్న తారక్ టీమ్ !

21st, September 2017 - 12:32:39 PM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జై లవ కుశ’ ఈరోజే విడుదలైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున 2400 స్క్రీన్లకు పైగా విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయి ఓపెనింగ్స్ సాధించే దిశగా వెళుతోంది. మరోవైపు చిత్ర టీమ్ కూడా సినిమా పైరసీ బారిన పడకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు, సోషల్ నెట్వర్కుల వినియోగం ఎక్కువైన తరుణంలో కొందరు ప్రేక్షకుల అత్యుత్సాహం వలన థియేటర్ నుండే సినిమాలోని పాటలు, కీ సీన్స్ బయటికొచ్చేస్తున్నాయి. సరైన సెక్యూరిటీ లేని థియేటర్లలో పైరసీ కూడా జరుగుతోంది. అందుకే చిత్ర టీమ్ ఇంటర్నెట్లో ఎక్కడైనా పైరసీ ప్రింట్లకు సంబందించిన లింక్స్ కనబడితే తమకు తెలియజేయమని, పైరసీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలియజేసింది. కాబట్టి అందరూ సహకరించి సినిమా పైరసీ బారిన పడకుండా చూడాలి.