సక్సెస్ సంబరాలకు సిద్దమవుతున్న ఎన్టీఆర్ టీమ్ !
Published on Sep 25, 2017 11:24 am IST


ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జై లవ కుశ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి నాలుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.64 కోట్ల గ్రాస్, రూ.40 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం తారక్ కెరీర్లోనే ఐటీడీజిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ షేర్ విలువ రూ.50 కోట్లను దాటేసింది. దీంతో వరుసగా మూడుసార్లు రూ.50 కోట్ల షేర్ ను అందుకున్న హీరోగా తారక్ ఘనత వహించాడు.

ఇంత మంచి విజయాన్ని అందుకున్నందుకు గాను ఎన్టీఆర్ అండ్ టీమ్ ఈరోజు సాయంత్రం సక్సెస్ సంబరాల్ని నిర్వహించనున్నారు. ఈ కలెక్షన్ల జోరు ఇలాగే గనుకు కొనసాగిపోతే చిత్రం త్వరలోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరుకునే చాన్సులున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం, అన్నదమ్ముల అనుబంధం వంటి అంశాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తారక్ త్వరలోనే త్రివిక్రమ్ సినిమాకి సిద్దంకానున్నాడు.

 
Like us on Facebook